కొత్త ఎల్పీజీ కనెక్షన్ పిరం
ఇప్పటికే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రేటును అడ్డగోలుగా పెంచి, సబ్సిడీని ఎత్తేసి సామాన్యుడి నడ్డి విరిచిన మోదీ సర్కారు.. మరో నిర్ణయం తీసుకొన్నది. కొత్త గ్యాస్ కనెక్షన్లపై అదనంగా రూ.750 వడ్డిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకొన్నాయి. ఇప్పటి వరకు కొత్త గ్యాస్ కనెక్షన్పై సెక్యూరిటీ డిపాజిట్ రూ.1,450 ఉండగా
అదనంగా రూ.750 చెల్లించాల్సిందే
గ్యాస్ రెగ్యులేటర్పైనా 100 వడ్డింపు
సామాన్యుడిపై మోదీ సర్కారు పిడుగు
న్యూఢిల్లీ, జూన్ 15: ఇప్పటికే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రేటును అడ్డగోలుగా పెంచి, సబ్సిడీని ఎత్తేసి సామాన్యుడి నడ్డి విరిచిన మోదీ సర్కారు.. మరో నిర్ణయం తీసుకొన్నది. కొత్త గ్యాస్ కనెక్షన్లపై అదనంగా రూ.750 వడ్డిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకొన్నాయి. ఇప్పటి వరకు కొత్త గ్యాస్ కనెక్షన్పై సెక్యూరిటీ డిపాజిట్ రూ.1,450 ఉండగా, రూ.750 కలుపుకొని.. రూ.2,200 అయ్యింది. చాలామంది వినియోగదారులు కనెక్షన్ తీసుకొనేప్పుడే రెండు సిలిండర్ బుడ్డీలు తీసుకొంటారు. అలాంటివారు రూ.4,400 సమర్పించుకోవాల్సిందే. అంతేకాదు.. గ్యాస్ రెగ్యులేటర్పైనా అదనంగా రూ.100 పెరిగింది. ఇప్పటి వరకు రూ.150 ఉండగా, దాని రేటును రూ.250కి పెంచారు.
5 కిలోల సిలిండర్ సెక్యూరిటీ ధర కూడా!
5 కిలోల సిలిండర్ సెక్యూరిటీని కూడా పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకొన్నాయి. ఇప్పటి వరకు సెక్యూరిటీ కింద రూ.800 వసూలు చేస్తుండగా, దాన్ని రూ.1,150కి పెంచేశాయి. కొత్త కనెక్షన్ తీసుకొనే సమయంలో పాస్బుక్కు రూ.25, పైప్కు రూ.150 చెల్లిస్తున్న సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Centre
- hike
- LPG
- New LPG connection
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

