RPF Constable | దేశ రాజధాని ఢిల్లీ రైల్వే స్టేషన్ (Delhi Railway Station)లో తొక్కిసలాట (Stampede) ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వారాంతం కావడంతో ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లేందుకు యాత్రికులు శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నేపథ్యంలో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రద్దీని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
రైల్వే స్టేషన్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో ఓ మహిళా ఆర్పీఎఫ్ (Railway Protection Force) కానిస్టేబుల్‌కు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అయిన రీనా తన నెలల బిడ్డతో స్టేషన్లో విధులు నిర్వహిస్తూ కనిపించింది. తన బిడ్డను ఎత్తుకుని క్రౌడ్‌ను కంట్రోల్ చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
#नईदिल्लीरेलवेस्टेशन पर RPF की सिपाही रीना गोद में बच्चा लेकर की ड्यूटी कर रही हैं. प्लेटफॉर्म पर भगदड़ न मचे, इसके लिए रीना यात्रियों को सतर्क कर रही थीं. #Delhi#trainaccident #NewDelhiRailwaystation #NewDelhiRailwayStationStampede #STAMPEDE #StampedeInDelhi #stampededeaths pic.twitter.com/Q4pZFXUKeO
— Rajkumar Pandey (@rajkumaarlive) February 17, 2025
కాగా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రయాగ్ రాజ్ ఎక్స్‌ప్రెస్, ప్రయాగ్‌రాజ్ స్పెషల్ రైళ్ల పేర్లు రెండూ ఒకేలా ఉండటమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. శనివారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ప్లాట్ఫారం 14పై ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ ఉంది. అదే సమయంలో ప్రయాగ్‌రాజ్ స్పెషల్ రైలు 12వ నంబర్ ప్లాట్‌ఫాంపైకి వస్తున్నట్టు అనౌన్స్ చేశారు.
అయితే అప్పటికే 14వ ప్లాట్‌ఫాంపై వేచి చూస్తున్న చాలామంది తాము ఎక్కాల్సింది అ రైలేమోనని భావించి గందరగోళానికి గురయ్యి 12వ నంబర్ పైకి వెళ్లడానికి ఓవర్ బ్రిడ్జి వైపు పరుగులు తీశారు. మరికొందరు జనరల్ టికెట్లు తీసుకున్న వారు సైతం అందులో సీటు దొరుకుతుందేమోనని పరుగులు పెట్టారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 14 మంది మహిళలు, నలుగురు పిల్ల లు ఉండగా.. 10 ఏండ్ల లోపు వారు ఇద్దరు ఉన్నారు. డజను మందికి పైగా ప్రయాణికులు గాయపడగా, వారికి లోక్‌నాయక్ జయ్‌ప్రకాశ్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు.
Also Read..
Railway Station | ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట.. ప్లాట్‌ఫారమ్ టికెట్ల విక్రయాలు బంద్..!
Holding Zones | తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం.. 60 స్టేషన్లలో ‘హోల్డింగ్ ప్రాంతాలు’