న్యూఢిల్లీ: భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య.. పేర్లతో తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయని కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ తాజాగా ప్రకటించారు. ‘ కొత్త చట్టాలు దేశ ంలోని క్రిమినల్ న్యాయ వ్యవస్థకు అత్యంత కీలకం. నేర స్వభావాన్ని బట్టి సాధారణ నేరాల్లో పోలీస్ కస్టడీ 15 రోజుల నుంచి 90 రోజులకు పెరిగింది. అలాగే భారతీయ న్యాయ సంహితలో కొత్తగా 20 నేరాల్ని చేర్చాం’ అని తెలిపారు.