Tejas fighter jet : కూలిపోతున్న తేజస్ ఫైటర్ జెట్ (Tejas fighter jet) ను పైకి లేపేందుకు పైలట్ (Pilot) ఆఖరిదాకా విఫలయత్నం చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. పడిపోతున్న జెట్‌ను పైకి లేపేందుకు పైలట్, వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్ (Namansh Syal) చివరి క్షణం వరకు ప్రయత్నంచిన దృశ్యాలు ఆ వీడియోలో క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తున్నాయి.
దుబాయ్ ఎయిర్‌షోలో శుక్రవారం భారత వాయుసేనకు చెందిన తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయింది. ఈ ఘటనలో ఐఏఎఫ్ పైలట్, వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్ మృతిచెందారు. స్యాల్ స్వరాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. చివరి సెకన్లలో జెట్ మంటల్లో చిక్కుకోగా పారాచూట్ లాంటిది బయటికి వచ్చినట్లు కనిపించింది. దాన్నిబట్టి చివరి క్షణంలో పైలట్ బయటికి వచ్చేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కానీ అప్పటికే సమయం మించిపోయింది.
వీడియోను బట్టిచూస్తే పైలట్ ముందే తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తే బయటపడేవాడేనని అర్థమవుతోంది. చివరి క్షణంవరకు పైలట్.. జెట్‌ను కాపాడే ప్రయత్నం చేసినట్లు, వీలు పడకపోవడంతో ఆఖరికి పారాచూట్ సాయంతో బయటికి రాబోయినట్లు, కానీ అప్పటికే ఆలస్యం కావడంతో బయటపడలేకపోయినట్లు ఆ వీడియోను చూస్తే అనిపిస్తోంది. కింది వీడియోలో ఆ దృశ్యాలను మీరు కూడా చూడవచ్చు..
Full video of Tejas crash.
Seems like Engine stopped thrusting just before the end and then nosedive.
Engine failure??Video Credit @wltan1791a pic.twitter.com/pgtONwIhOg
— Margin of Safety🇮🇳 (@InvestorOfJAMMU) November 22, 2025