Delhi Accident | కాంజావాల్ ఘటన సిగ్గుచేటు : కేజ్రీవాల్
కొత్త సంవత్సరం వేళ దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున స్కూటీపై వెళ్తున్న 20 ఏండ్ల యువతిని ఢీకొన్న ఓ కారు.. ఆమెను దాదాపు 4 కిలోమీటర్ల దూరం అలాగే ఈడ్చుకెళ్లింది. ఈ దారుణ ఘటనలో సదరు యువతి ప్రాణాలు కోల్పోయింది. కాగా,ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కాంజావాల్ ఘటన చాలా సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. దోషులను కఠినంగా శిక్షిస్తారని ఆశిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఘటనకు సంబంధించిన ఓ పేపర్ క్లిప్‌ను ట్వీట్‌కు జతచేశారు.
Delhi Accident | కొత్త సంవత్సరం వేళ దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున స్కూటీపై వెళ్తున్న 20 ఏండ్ల యువతిని ఢీకొన్న ఓ కారు.. ఆమెను దాదాపు 4 కిలోమీటర్ల దూరం అలాగే ఈడ్చుకెళ్లింది. ఈ దారుణ ఘటనలో సదరు యువతి ప్రాణాలు కోల్పోయింది. కాగా,ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కాంజావాల్ ఘటన చాలా సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. దోషులను కఠినంగా శిక్షిస్తారని ఆశిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఘటనకు సంబంధించిన ఓ పేపర్ క్లిప్‌ను ట్వీట్‌కు జతచేశారు.
మరోవైపు దారుణ ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. ఈ ఘటన సిగ్గుతో తలవంచుకోవాల్సిన దారుణమని వ్యాఖ్యానించారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారించి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. కాగా, ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యువతిని ఢీకొట్టి.. 4 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి!
ఈ ఘటన ఢిల్లీ శివారులోని కాంజావాల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఇదే సమయంలో ఓ మహిళ బట్టలు లేకుండా.. కాళ్లు విరిగి ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వీడియోలో ఉన్నది ప్రమాదానికి గురైన యువతేనా కాదా అనేదానిపై స్పష్టత లేదు. ఆ ఫుటేజీని పరిశీలిస్తే నిందితులు బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడి, అనంతరం హత్య చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది యాక్సిడెంట్ మాత్రమేనని పోలీసులు చెప్పారు. లైంగిక దాడి కోణం ఇందులో లేదని పేర్కొన్నారు.
कंझावला में हमारी बहन के साथ जो हुआ, वो बेहद शर्मनाक है। मैं उम्मीद करता हूँ कि दोषियों को कड़ी से कड़ी सज़ा दी जाएगी। pic.twitter.com/Mmuuf8HnWl
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 2, 2023
My head hangs in shame over the inhuman crime in Kanjhawla-Sultanpuri today morning and I am shocked at the monstrous insensitivity of the perpetrators.
Have been monitoring with @CPDelhi and the accused have been apprehended. All aspects are being thoroughly looked into.— LG Delhi (@LtGovDelhi) January 1, 2023
Clear CCTV of Delhi Kanjhawala Accident where girl dragged for few KM #Kanjhawala #delhi @SwatiJaiHind @RahulGandhi pic.twitter.com/Di1T2B7o4h
— Sachin Tiwari (@truth_reporting) January 1, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

