న్యూఢిల్లీ: స్విస్ దిగ్గజ ఆహార, పానీయ ఉత్పత్తుల సంస్థ నెస్లే వచ్చే రెండేండ్లలో ప్రపంచవ్యాప్తంగా 16 వేల ఉద్యోగాలను తొలగిస్తామని గురువారం ప్రకటించింది. కంపెనీ కొత్త సీఈవో ఫిలిప్ నవ్రటిల్ గత నెలలో బాధ్యతలు చేపట్టాక ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఉద్యోగాల తొలగింపు బాధాకరమైన విషయమైనా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కార్యకలాపాలను క్రమబద్దీకరించడం కోసం ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం అవసరమని ఆయన చెప్పారు. తొలగించనున్న ఉద్యోగాల్లో 12 వేలు వైట్ కాలర్ స్థాయివి. ఈ ఉద్యోగాల కోత వల్ల ఒక బిలియన్ స్విస్ ఫ్రాంక్లు కంపెనీకి ఆదా అవుతాయని అంచనా.