న్యూఢిల్లీ: నీట్-యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ అయ్యిందన్న వార్తల నేపథ్యంలో ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కోరుతూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మే 5న నీట్‌ను నిర్వహించారు. పరీక్ష ఫలితాలు జూన్ 14న రాబోతున్నాయి. పిటిషన్‌పై సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఈ వారంలో విచారణను చేపట్టనున్నది.