న్యూఢిల్లీ, జూన్ 14 : ఈ నెల 21న నిర్వహిస్తున్న నీట్ యూజీ-2026 రీ-టెస్ట్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులను ‘ఎన్టీఏ’ తాజాగా విడుదల చేసింది. దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్న ఈ పరీక్షను సజావుగా నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పటిష్ఠమైన పర్యవేక్షణ, భద్రతా ఏర్పాట్ల నడుమ జూన్ 21 ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5.15 గంటల వరకు పెన్-పేపర్ విధానంలో పరీక్ష ఉండబోతున్నది.
పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in ద్వారా తమ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం గాను విద్యార్థులు తమ దరఖాస్తు సంఖ్య, పుట్టిన తేదీలతో కూడిన పాస్‌వర్డ్‌ను ఉపయోగించాలి. మే 3న నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ కావడంతో తిరిగి ఈ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.