NEET UG 2026 : మెడికల్ విద్యలో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ రీఎగ్జామ్ 2026 పరీక్ష ఈ నెల 21న జరగనుంది. ఇది రీ ఎగ్జామ్ అనే సంగతి తెలిసిందే. ఈ పరీక్ష కోసం అభ్యర్తులు దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, గతంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎన్టీయే (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) కీలక మార్పులు చేసింది. విద్యార్తులపై ఒత్తిడి తగ్గేలా, వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసింది.
పరీక్ష రాసే సమయాన్ని పెంచింది. గతంలో మూడు గంటలు ఉండే పరీక్ష ఇప్పుడు మరో 15 నిమిషాలు అదనంగా జరగనుంది. మధ్యాహ్నం 02.00 గంటల నుంచి సాయంత్రం 05.15 గంటల వరకు పరీక్ష జరగనుంది. అలాగే, విద్యార్తులు రఫ్ వర్క్ చేసుకునేందుకు అదనంగా రఫ్ వర్క్ షీట్లను కేటాయించనున్నారు. ఇంతకుముందు కొశ్చన్పేపర్తోపాటు రెండు పేజీలను మాత్రమే రఫ్ వర్క్ కోసం కేటాయించేవారు. ఇప్పుడు జరగబోయే పరీక్షలో మాత్రం నాలుగు రఫ్ వర్క్ పేపర్లు ఉంటాయి. అలాగే, ఎడమచేతి వాటం ఉన్న అభ్యర్థుల కోసం, వారికి అనుకూలంగా రఫ్ వర్క్ పేజీలను రీడిజైన్ చేశారు.
బుక్లెట్ చివర్లో ఉండే రఫ్ వర్క్ పేపర్లలో రెండు పేజీలు బుక్లెట్ ఓపెన్ చేయగానే కనిపిస్తాయి. అన్ని భాషల వారికి కూడా ఇదే పద్ధతి వర్తిస్తుంది. అలాగే, గతంలో ఒరిజినల్ డాక్యుమెంట్లు, హాల్ టికెట్ వెరిఫికేషన్, సైనింగ్ వంటి ఇన్విజిలేషన్ యాక్టివిటీస్ కోసం టైం వేస్ట్ అయ్యేది. అయితే, ఇప్పుడు దీనికోసం అదనపు సమయం కేటాయిస్తారు. ఈ చిన్నచిన్న మార్పులు విద్యార్తులకు మరింత ప్రయోజనం కలిగిస్తాయని ఎన్టీయే పేర్కొంది.