న్యూఢిల్లీ, మే 24: కర్ణాటకలోని కలబురిగిలో నీట్ విద్యార్థిని భాగ్యలక్ష్మి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనాస్థలంలో సూ సైడ్ నోట్ లాంటిదేదీ లభించలేదని పోలీసులు చెబుతున్నారు. ఆమె తండ్రి రాజశేఖర్ మాట్లాడుతూ, తమ కుమార్తె చదువులో ముందుందని అన్నారు.
12వ తరగతి పరీక్షల్లో 92 శాతం మార్కులు సాధించటంతో.. నీట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. మే 3న నిర్వహించిన నీట్-యూజీ పరీక్ష.. పేపర్ లీక్ ఆరోపణల కారణంగా రద్దయ్యింది. ఈ పరీక్ష రద్దు తర్వాత గత 12 రోజుల్లో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల సంఖ్య ఐదుకు చేరుకుంది.