న్యూఢిల్లీ : నీట్ పీజీ 2026 పరీక్షకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎమ్ఎస్) జూలై 1న ప్రారంభించింది. అభ్యర్థులు జూలై 21 ఉద యం 11.55 గంటల లోపు అప్లికేషన్లు సమర్పించాలని సూచించింది. ఎన్బీఈఎమ్ఎస్ వెబ్సైట్లో ఐప్లె చేసుకోవచ్చని తెలిపింది. ఆగస్టు 11న అభ్యర్థులకు కేటాయించిన ఎగ్జామ్ సెంటర్ ముందస్తు సమాచారాన్ని తెలియజేస్తామని ఎన్బీఈఎమ్ఎస్ వెల్లడించింది. ఆగస్టు 30న పరీక్ష నిర్వహిస్తామని.. ఫలితాలు సెప్టెంబర్ 30న రిలీజ్ చేస్తామని తెలిపింది.
ఎగ్జామ్ సెంటర్ కేటాయింపులో మార్పు..
నీట్-పీజీ పరీక్షలో గతంలో మొద ట ఐప్లె చేసుకున్నవారికి మొదటి ప్రాధాన్యత పద్ధతిలో ఎగ్జామ్ సెంటర్లను కేటాయించేవారు. ఆ రూల్ను ఎన్బీఈఎమ్ఎస్ ఎత్తేసింది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేటప్పుడే మూడు రాష్ర్టాలను ఎంచుకోవాలి. అందులో మొదటిది అభ్యర్థి నివసిస్తున్న రాష్ట్రం అయి ఉండాలి. మిగతావి పొరుగు రాష్ర్టాలను ఎంచుకోవాలి. ప్రస్తుతం ఉన్న రాష్ర్టాన్ని కేటాయించే అవకాశం ఉందా లేదంటే మిగతా రెండు రాష్ర్టాల్లో ఏది కేటాయించాలో ఎన్బీఈఎమ్ఎస్ నిర్ణయిస్తుంది.