NEET exam : నీట్ పరీక్ష (NEET exam) కు వ్యతిరేకంగా కర్ణాటక అసెంబ్లీ తీర్మానం చేసింది. కర్ణాటక మెడికల్ ఎడ్యుకేషన్ & స్కిల్ డెవలప్ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్ (Sharan Prakash Patil) బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చ అనంతరం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. నీట్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కొన్ని రోజుల క్రితమే కర్ణాటక క్యాబినెట్ నిర్ణయించింది.
కర్ణాటక క్యాబినెట్ నీట్ రద్దుపై నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ నీట్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ఈ నెల 23న నీట్ రద్దును కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానం బెంగాల్ అసెంబ్లీ ఆమోదించింది. ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో అవకతవకలు బయటపడంతో నీట్ నిర్వహణపై అనుమానాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నీట్‌ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త విధానం తీసుకురావాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.