NEET Student | కోటా (రాజస్థాన్): ‘నాకు పై చదువులు చదవాలని లేదు. నా దగ్గర రూ.8 వేలు ఉన్నాయి. నేను ఐదేండ్లపాటు వెళ్లిపోతా. నేను ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోను. కచ్చితంగా ఏడాదికోసారి కాల్ చేస్తా’ అని తండ్రి ఫోన్‌కు మెసేజ్ పెట్టి 19 ఏండ్ల విద్యార్థి అదృశ్యమయ్యాడు.
నీట్‌కు రాజస్థాన్‌లోని కోటాలో ప్రిపేర్ అవుతున్న తన కొడుకు ఈ నెల 6న ఇలా మెసేజ్ పెట్టడంతో అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.