న్యూఢిల్లీ: పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో తొలి అపాచీ అటాక్ హెలికాప్టర్ స్క్వాడ్రన్‌ను (Apache Helicopter Squadron) భారత ఆర్మీ ఏర్పాటు చేసింది. ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అజయ్ సూరి, బోయింగ్ అధికారులు, ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో శుక్రవారం దీనిని ప్రారంభించారు. ఈ ఏడాది మే నాటికి మొదటి బ్యాచ్ అపాచీ అటాక్ హెలికాప్టర్లు ఇక్కడకు చేరుతాయని ఆర్మీ అధికారులు తెలిపారు.
కాగా, ‘ట్యాంక్స్ ఇన్ ది ఎయిర్’ అని వ్యవహరించే అధునాతన దాడి హెలికాప్టర్లు అమెరికా నుంచి ఐఏఎఫ్‌కు చెందిన హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు చేరుకోనున్నాయి. అనంతరం మే నెలలో భారత్, పాకిస్థాన్ సరిహద్దు సమీపంలోని జోధ్‌పూర్‌లో వీటిని మోహరించనున్నారు. ఐఏఎఫ్ ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లను నిర్వహిస్తోంది. తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో వీటిని మోహరించింది.