పట్నా: బీహార్‌లో ఎన్డీయే కూటమి మరోసా రి స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. రాష్ట్రం లో 40 లోక్‌సభ స్థానాలు ఉండగా ఎన్డీయే కూటమికి 30 స్థానాలు దక్కాయి. ఎన్నికల ముంగిట బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్డీయేలో చేరడం ఆ కూటమికి బాగా కలిసొచ్చింది. ఇండియా కూటమి విజయావకాశాలను నితీశ్ భారీగా దెబ్బకొట్టారు. కాగా, బీహార్‌లో ఇండియా కూటమి కేవలం తొమ్మిది స్థానాలకే పరిమితమైంది.
బీహార్‌లో బీజేపీకి ఎన్నికల్లో ఐదు స్థానాలు తగ్గాయి. 2019లో 17 స్థానాల్లో పోటీ చేసి 17 స్థానాలనూ గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో మాత్రం 17 స్థానాలకు గానూ 12 స్థానాలను మాత్రమే దక్కించుకుంది. జేడీయూ 16 సీట్లకు గానూ 12 సీట్లు, లోక్‌జనశక్తి పార్టీ(రామ్ విలాస్) 5కు 5 స్థానాలను గెలుపొందాయి.
ఇండియా కూటమికి బీహార్‌లో ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఆర్జేడీకి ఈ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ 23 స్థానాల్లో పోటీ చేయగా 4 స్థానాల్లోనే విజయం సాధించింది. కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో పోటీ చేసి కేవలం మూడు గెలిచింది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఐ(ఎంఎల్)
(ఎల్) రెండో చోట్ల విజయం దక్కించుకుంది.
ఎన్డీయే 30
ఇండియా 9
స్వంతంత్రులు 1