పాట్నా: బీహార్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) మండిపడ్డారు. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం పాత వాహనం మాదిరిగా ప్రజలకు భారంగా మారిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో 15 ఏళ్ల వాహనాల మాదిరిగా ఆ ప్రభుత్వాన్ని నిషేధించాలని అన్నారు. శనివారం ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. ‘బీహార్‌లో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని 20 ఏళ్ల ఎన్డీయే ప్రభుత్వం ఇప్పుడు పాతగా, పాడైన వాహనంగా మారింది. బీహార్ అంతటా 15 ఏళ్ల కంటే ఎక్కువ కాలం నాటి వాహనాలపై నిషేధం ఉంది. ఎందుకంటే అవి ఎక్కువ పొగను విడుదల చేస్తాయి. కాలుష్యాన్ని పెంచుతాయి. ప్రజలకు హానికరం. అందుకే 20 ఏళ్ల దుర్భరమైన ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేయడానికి ఎందుకు అనుమతించాలి? ఈ ప్రభుత్వం బీహార్ ప్రజలకు భారంగా మారింది. దీనిని మార్చాలి’ అని అందులో పేర్కొన్నారు.
కాగా, గత 20 ఏళ్లుగా నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో పేదరికం, నిరుద్యోగం, అవినీతి, నేరాలు, వలసలు వంటి ప్రాణాంతక కాలుష్యాన్ని వ్యాప్తి చేసిందని తేజస్వి యాదవ్ మండిపడ్డారు. నితీశ్-బీజేపీ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరించడం వలన 20 ఏళ్లలో రెండు తరాల జీవితాలు నాశనం అయ్యాయని విమర్శించారు. ‘ఈ శిథిలమైన, అనారోగ్యకరమైన, నమ్మదగని ప్రభుత్వాన్ని తొలగించి, కొత్త ఆలోచన, కొత్త దృక్పథం, కొత్త ఉత్సాహం, కొత్త దిశను తీసుకురావాలని బీహార్ యువత నిశ్చయించుకున్నారు. ఇది విశ్వసనీయమైనది. ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధిని అందించడానికి అంకితభావంతో ఉంటుంది’ అని ఆ పోస్ట్‌లో ప్రస్తావించారు.
बिहार में 𝟏𝟓 साल पुरानी गाड़ी चलाने की अनुमति नहीं है क्योंकि वो ज़्यादा धुँधा फेंकती है, प्रदूषण बढ़ाती, जनता के लिए हानिकारक है तो फिर 𝐍𝐃𝐀 की 𝟐𝟎 साल पुरानी जोड़-तोड़, पलटा-पलटी वाली खटारा सरकार क्यों चलेगी?
𝟐𝟎 वर्षों की नीतीश सरकार ने विगत 𝟐𝟎 साल में बिहार के हर… pic.twitter.com/6j2UTKpoMy
— Tejashwi Yadav (@yadavtejashwi) March 1, 2025