బెంగళూరు: కేంద్రంలో మోదీ ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని, ఏ సమయంలోనైనా ప్రభు త్వం కూలిపోవచ్చని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ మోదీకి ప్రజామోదం లేదని, కేంద్రంలో మైనార్టీ ప్రభుత్వం ఉందన్నారు. అయితే తాము ఈ ప్రభుత్వం కొనసాగాలని, దేశానికి మంచి చేయాలని కోరుకుంటున్నామని అన్నారు. దేశాన్ని బలోపేతం చేసేందుకు కలిసి పని చేస్తామని అన్నారు. కాగా, ఖర్గే వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తప్పు పట్టారు. ఖర్గే మూర్ఖుల లోకంలో జీవిస్తున్నాడని, మోదీ ప్రభుత్వం ఎప్పటికీ పడిపోదని పేర్కొన్నారు.