న్యూఢిల్లీ: జాతీయ మహిళా కమీషన్(NCW)కు ఈ ఏడాది సుమారు 12,600 ఫిర్యాదులు అందినట్లు ఓ అధికారిక డేటా ప్రకారం తెలుస్తోంది. దీంట్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఫిర్యాదులు నమోదు అయ్యాయి. రైట్ టు డిగ్నిటీ కింద ఎక్కువ ఫిర్యాదులు అందుకున్నట్లు డేటాలో వెల్లడించారు. దీంట్లో గృహ హింస కాకుండా ఇతర వేధింపులు రానున్నాయి. ఇలాంటివి సుమారు 3,107 ఫిర్యాదు ఉన్నట్లు ఎన్సీడబ్ల్యూ డేటా ప్రకారం తెలుస్తోంది. వర కట్న వేధింపులు కింద నమోదు అయిన ఫిర్యాదులు 1957 ఉన్నాయి. వేధింపులు 817, మహిళల పట్ల పోలీసుల వైఖరిలో 518, అత్యాచారం కింద 657 ఫిర్యాదులు ఉన్నట్లు డేటా ప్రకారం తెలుస్తోంది. లైంగిక వేధింపుల కింద 493, సైబర్ క్రైం కింద 339, వెంబడించడం లాంటివి 345, హానర్ క్రైం కింద 206 ఫిర్యాదులు ఉన్నాయి.
యూపీ నుంచి మొత్తం 6470 ఫిర్యాదులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ నిలిచింది. ఢిల్లీలో 1113, మహారాష్ట్రలో 762, బీహార్ల 584, మధ్యప్రదేశ్లో 514, హర్యానాలో 506, రాజస్థానలో 408, తమిళనాడులో 301, బెంగాల్లో 306, కర్నాటకలో 305 ఫిర్యాదులు నమోదు అయ్యాయి. 2023లో 28,811ఫిర్యాదులను ఎన్సీడబ్ల్యూ రిజిస్టర్ చేసింది.