న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 2020 సంవత్సరంలో 13వేలకుపైగా రైలు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 12వేల మంది మృత్యువాతపడ్డారు. ఈ విషయాలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలో వెల్లడయ్యాయి. గత సంవత్సరం రైలు ప్రమాదాల్లో రోజుకు 32 మంది మృతి చెందారని నివేదిక పేర్కొంది. అయితే, 8,400 మంది (70శాతం) రైలు నుంచి పడడం, ట్రాక్ దాటుతున్న సమయంలో మృతి చెందారని తెలిపింది.
మహారాష్ట్రలోనే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది. మహారాష్ట్రలో జరిగిన రైలు ప్రమాదాల్లో 1,922 మంది మృతి చెందగా.. యూపీలో 1558 మంది చనిపోయారు. ఇవే కాకుండా రైల్వే క్రాసింగ్ల వద్ద జరిగే ప్రమాదాల్లో ఉత్తరప్రదేశ్ టాప్లో నిలువగా.. బిహార్, మధ్యప్రదేశ్ రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి.
అంతకు ముందు ఈ ఏడాదితో పాలిస్తే 2020 కొంత పరిస్థితులు మెరుగుపడినట్లు కనిపిస్తున్నాయని నివేదిక పేర్కొంది. 2019లో దేశవ్యాప్తంగా 27,987 రైలు ప్రమాదాలు జరగ్గా.. 2020లో 13,018 ప్రమాదాలు రికార్డయ్యాయి. 2020లో 9,117 ప్రమాదాలు రైలు నుంచి పడిపోవడం, ఎదురుగా రావడం తదితర ప్రమాదాల్లో 8,400 మంది మృత్యువాతపడ్డారని ఎన్సీఆర్బీ నివేదిక వివరించింది.