పుణె: మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి పటిష్ఠంగా ఉన్నదని ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఆదివారం స్పష్టం చేశారు. పుణె జిల్లాలోని బారామతిలో రమీడియాతో మాట్లాడుతూ అధ్యక్ష పదవిలో కొనసాగుతానని శరద్ పవార్ చేసిన ప్రకటన కూటమికి నూతన శక్తిని ఇచ్చిందన్నారు.
ఎన్సీపీ చీఫ్ పదవి నుంచి తప్పుకోవాలన్న నిర్ణయాన్ని విరమించుకుంటున్నట్టు శరద్ పవార్ శుక్రవారం ప్రకటించిన సమావేశానికి తాను కావాలనే గైర్హాజరయ్యారంటూ వస్తున్న వార్తలను అజిత్ పవార్ కొట్టి పారేశారు. అజిత్ బీజేపీతో చేతులు కలుపుతున్నారన్న ఊహగానాల నేపథ్యంలో శరద్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు.