ముంబై : పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై గళమెత్తిన ఎంపీలను సభ నుంచి బహిష్కరించడం పట్ల ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Parliament Security Breach) ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని దాదాపు 100 మంది విపక్ష ఎంపీలను ప్రభుత్వం బహిష్కరించడం గర్హనీయమని పవార్ అన్నారు.
పార్లమెంట్ భద్రతపై వివరణ కోరే చట్టబద్ధ హక్కు ఎంపీలకు ఉందని, ఘటన తీవ్రతకు స్పందనగానే ఎంపీలు నిరసన చేపట్టారని శరద్ పవార్ పేర్కొన్నారు. ఎంపీల సస్పెన్షన్ వ్యవహారంపై రాజ్యసభ సభ్యుడు కూడా అయిన పవార్ పెద్దల సభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్కు లేఖ రాశారు. విపక్ష ఎంపీలను పెద్దసంఖ్యలో సస్పెండ్ చేయడంపై పవార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ఎంపీలు వివరణ కోరడం సహజమని, ప్రభుత్వం ఓ ప్రకటనతో ముందుకొచ్చి సభ్యులకు వివరణ ఇవ్వాలని పవర్ పేర్కొన్నారు. ఇంత తీవ్రమైన అంశంపై ప్రభుత్వం ప్రకటన చేయకపోవడం అటుంచి వివరణ కోరిన ఎంపీలను సస్పెండ్ చేయడం సరైంది కాదని ఈ లేఖలో పవార్ ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :
Karnataka | కొవిడ్ జేఎన్.1 వేరియంట్.. కర్ణాటకలో మాస్క్ మస్ట్