శ్రీనగర్: తమ కార్యకర్తలపై వేధింపులు, అక్రమ అరెస్టులను ఆపాలని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీడీపీ పార్టీలు ఎన్నికల కమిషన్ (ఈసీ)ని కోరాయి. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో సోమవారం పోలింగ్ జరుగుతుంది. తమ పార్టీకి గట్టి పట్టు ఉన్న ప్రాంతాల్లో తక్కువ పోలింగ్ జరిగే విధంగా ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రయత్నిస్తున్నారని పీడీపీ అభ్యర్థి వహీద్ పర, కేంద్రం నియంతలా వ్యవహరిస్తున్నదని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.