న్యూఢిల్లీ, మార్చి 1: వ్యక్తుల సమ్మతి లేకుండా వారి లైంగిక ధోరణిని బ్రాడ్కాస్టర్లు వెల్లడించరాదని న్యూస్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎన్బీడీఎస్ఏ) తెలిపింది. వ్యక్తి ప్రాధాన్యమిచ్చే పేర్లు, సర్వనామాలను గౌరవించాలని చెప్పింది.
స్త్రీ, పురుష, నపుంసక వంటి భేదాలు బయటకు వెల్లడి కాకుండా తటస్థంగా ఉండే పదాలను ఉపయోగించాలని తెలిపింది. ఎల్జీబీటీక్యూఐఏప్లస్ వ్యక్తులకు సంబంధించిన అంశాలను, వార్తలను ప్రసారం చేసేటపుడు ఈ మార్గదర్శకాలను పాటించాలని చెప్పింది. వీరి గురించి సున్నితత్వం, కచ్చితత్వం లేకుండా చేసే రిపోర్టింగ్ వల్ల తీవ్రమైన సాంఘిక పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించింది.