న్యూఢిల్లీ: అడవుల్లో నక్సలైట్లను నియత్రించగలిగామని, కానీ పట్టణ నకల్స్ సంఖ్య పెరుగుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. పట్టణ నక్సలైట్లకు రాజకీయ పార్టీలు అండగా నిలుస్తున్నాయని, ఆ పార్టీలు ఆ ఐడియాలజీకి జీవం పోస్తున్నాయని ఆరోపించారు. అర్బన్ నక్సల్స్ రాజకీయ పార్టీల్లోకి చొచ్చుకుపోతున్నట్లు చెప్పారు. నక్సలిజం తుది దశలో ఉన్నదని, గత పదేళ్లలో ప్రభావిత జిల్లాల సంఖ్య వంద నుంచి 24కు పడిపోయిందన్నారు. సమర్థవంతమైన ప్రభుత్వం, మౌళికసదుపాయాల విస్తరణ, అట్టడుగు స్థాయి అభివృద్ధి వల్ల తిరుగుబాటుదారులు తగ్గినట్లు చెప్పారు.
అర్బన్ నక్సల్స్‌తో కొత్త సవాళ్లు ఎదురవుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. పట్టణ నక్సల్స్ వల్ల భారత అభివృద్ధి, వారసత్వానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. మేధావి వర్గాల్లో భావజాల తీవ్రవాదం పెరుగుతున్నట్లు చెప్పారు. భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశయాలను చంపేసిందన్నారు. ఆ పార్టీ నుంచి ప్రజలు కూడా ఆశించడం మానేసినట్లు తెలిపారు.
&
VIDEO | Addressing the Republic Plenary Summit organised by a news channel in Delhi earlier today, PM Modi (@narendramodi) said ,”Naxalism in the country is also on its last legs. In the past, over 100 districts were severely affected by this menace. However, this number has… pic.twitter.com/6g4Y2R4WHo
— Press Trust of India (@PTI_News) March 6, 2025
;