Chhattisgarh | ఎమ్మెల్యే కాన్వాయ్‌పై నక్సల్స్ కాల్పులు.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ విక్రమ్ మాండవి
Chhattisgarh | ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్ మాండవి తన కాన్వాయ్‌పై నక్సల్స్ కాల్పులు జరిపారు. బీజాపూర్ జిల్లాలోని పడెడా గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చోటు చేసుకోగా.. ఎమ్మెల్యే తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. కాన్వాయ్‌లో ఉన్న జిల్లా పంచాయతీ సభ్యురాలు పార్వతి కశ్యప్ వాహనంపై సైతం కాల్పులు జరిపారు.
Chhattisgarh | ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్ మాండవి తన కాన్వాయ్‌పై నక్సల్స్ కాల్పులు జరిపారు. బీజాపూర్ జిల్లాలోని పడెడా గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చోటు చేసుకోగా.. ఎమ్మెల్యే తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. కాన్వాయ్‌లో ఉన్న జిల్లా పంచాయతీ సభ్యురాలు పార్వతి కశ్యప్ వాహనంపై సైతం కాల్పులు జరిపారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, కాన్వాయ్‌లో ఉన్న వారంతా సురక్షితంగా పోలీసులు తెలిపారు. కాల్పుల అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. కాల్పులపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఆ తర్వాత మాండవి విలేకరులతో మాట్లాడుతూ గంగలూరు వీక్లీ మార్కెట్లో జరిగిన సమావేశంలో పాల్గొని.. తిరిగి బీజాపూర్‌కు వస్తున్న సమయంలో పడేడ గ్రామం సమీపంలో కాల్పులు జరిగాయని తెలిపారు. ఇదిలా ఉండగా.. బీజాపూర్ జిల్లాలో అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బందితో జరిగిన ఎదురుకకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఇద్దరు నక్సలైట్లు గాయపడ్డారు. ఈ క్రమంలోనే నక్సల్స్ ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేలపై మావోయిస్టులు దాడి చేశారు. ఏప్రిల్ 2019లో దంతెవాడ ప్రాంతంలో మావోయిస్టులు వాహనాన్ని పేల్చివేయడంతో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి, నలుగురు పోలీసులు చనిపోయారు. ఎమ్మెల్యే వాహనాన్ని ఐఈడీ పేల్చడంతో సంఘటనా స్థలంలో భారీ గొయ్యి ఏర్పడింది. మరో వైపు ఈ ఏడాది ఫిబ్రవరిలో వారం వ్యవధిలో ముగ్గురు బీజేపీ నేతలను మావోయిస్టులు హతమార్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

