Navy| ఏదైనా సంక్షోభం.. అత్యవసర పరిస్థితుల్లో అందరికీ గుర్తుకు వచ్చేది సైన్యమే. భారీ వరదలైనా.. మరేదైనా సమస్య అయినా క్షణాల్లో త్రివిధ దళాలు స్పందిస్తుంటాయి. తాజాగా ఆరోగ్యం క్షీణించడంతో ఓ వ్యక్తిని ఎయిర్ లిఫ్ట్ చేసి కాపాడింది. వివరాల్లోకి వెళితే.. ముంబయికి దాదాపు 65 నాటికల్ మైళ్ల దూరంలోని ఓ షిప్ నుంచి భారత నావికాదళానికి సహాయం అందించాలని రిక్వెస్ట్ వచ్చింది. ఫ్రెంచ్ ఫ్లాగ్ కంటైనర్ షిప్లో ఓ వ్యక్తి ఆరోగ్యం క్షీణించింది. దాంతో షిప్ సిబ్బంది నేవీ సహాయం కోరారు. సదరు వ్యక్తి కళ్లు, నరాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ మేరకు సైనం ఐఎన్ఎస్ షిక్రా హెలికాప్టర్‌ను అంబులెన్స్‌గా పంపింది. అయితే, షిప్లో హెలికాప్టర్‌ను దింపేందుకు స్థలం లేకపోవడంతో.. నేవీ ప్రత్యేకంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి రోగిని కాపాడింది. దీంతో పెద్ద బాస్కెట్ దాని మాదిరిగా ఉన్న దాంట్లో సదరు వ్యక్తిని ఉంచి హెలీకాప్టర్‌లోకి తీసుకువచ్చారు. అనంతరం అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.
#WATCH | A Naval ALH MK III (MR) was promptly launched on 16 Jan in an ambulance role from INS Shikra upon receipt of an alert message of a patient with suspected Ophthalmic/ Neurological condition onboard French flag container carrier CMA CGM Palais Royal that was about 65 nm… pic.twitter.com/YBDsHvmcaK
— ANI (@ANI) January 17, 2024