న్యూఢిల్లీ : పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ భాషపై ఆ పార్టీ ఎంపీ గుర్జీత్ సింగ్ ఔజ్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేండ్ల నుంచి సిద్ధూ ప్రజలకు దూరంగా ఉన్నారన్నారు. అంతేకాకుండా ఇతర నాయకులపై సిద్ధూ ఉపయోగించే పదజాలం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చిందన్నారు. సిద్ధూ భాషపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. సిద్ధూ వాడిన భాష.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని ఎంపీ పేర్కొన్నారు.
ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, సంయమనంతో ఉండాలని ఎంపీ గుర్జీత్ సింగ్ సూచించారు. సిద్ధూ జాతీయ నాయకుడు.. ఆయనను చాలా మంది ఫాలో అవుతుంటారు. అలాంటప్పుడు ఆయన క్రమశిక్షణతో మెలగాల్సిన అవసరం ఉందని గుర్జీత్ సింగ్ అన్నారు. అమృత్సర్ ఈస్ట్ నుంచి సిద్ధూ బరిలో ఉన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి జీవన్ జోత్ కౌర్ పోటీ చేశారు.