న్యూఢిల్లీ: మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) నవీన్ చావ్లా (79) శనివారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ఎన్నికల కమిషన్ సంతాపం తెలిపింది. ఆయన అనేక సంస్కరణలు చేశారని, థర్డ్ జెండర్ ఓటర్లను ‘ఇతరులు’ విభాగంలో ఓటు వేసేందుకు అవకాశం కల్పించారని పేర్కొంది.
మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషీ మాట్లాడుతూ, తాను చావ్లాను 10 రోజుల క్రితం కలిశానని, మెదడు శస్త్ర చికిత్స కోసం అపోలో దవాఖానలో చేరుతున్నానని చెప్పారని తెలిపారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు ఖురేషీ ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు.