న్యూఢిల్లీ: ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్(Naveen Patnaik) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి పైకా తిరుగుబాటు పాఠ్యాంశాన్ని తొలగించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒడిశా వీరత్వానికి చిహ్నమైన ఆ తిరుగుబాటు గురించి పుస్తకాల్లో లేకుండా చేశారని ఆయన ఆరోపించారు. పైకా తిరుగుబాటు లేదా పైకా విద్రోం గురించి పాఠ్యాన్ని ఎన్సీఈఆర్టీ తొలగించిందని, ఒడిశా చరిత్రలో అదో కీలక ఘట్టం అని, కానీ ఆ అంశాన్ని పాఠ్య పుస్తకాల నుంచి తొలగించడం సమంజసం కాదు అని పట్నాయక్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రికి లేఖ రాశారు.
1817లో బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పైకా తిరుగుబాటు జరిగింది. సిపాయి ముట్నీకి 40 ఏళ్ల క్రితమే పైకా తిరుగుబాటు జరిగిందని, ఈ పాఠాన్ని టెక్ట్స్ బుక్స్ నుంచి ఎందుకు తీసి వేశారని ఆయన ప్రశ్నించారు. ఆ యోధులను అగౌరవపరచడమే అవుతుందన్నారు. పైకా తిరుగుబాటుదారుల పాఠ్యాంశాన్ని పునర్ పరిశీలించాలని ఒడిశా సీఎంను, కేంద్ర విద్యాశాఖ మంత్రిని కోరుతున్నట్లు మాజీ సీఎం పట్నాయక్ తెలిపారు.
Deeply concerned to know that the National Council of Educational Research and Training (@ncert) has dropped #Odisha’s Paika Rebellion or Paika Bidroha from its text books. The Paika rebellion was a watershed moment in Odisha’s history as our brave Paikas fought with…
— Naveen Patnaik (@Naveen_Odisha) July 22, 2025