Naveen Patnaik : తాము గేమ్ ఛేంజింగ్ బడ్జెట్ ప్రవేశపెడతామని రాష్ట్ర బీజేపీ నేతలు గొప్పలు చెప్పారని ఒడిషా మాజీ సీఎం, అసెంబ్లీలో విపక్ష నేత నవీన్ పట్నాయక్ ఎద్దేవా చేశారు. గేమ్ ఛేంజింగ్ బడ్జెట్‌కు బదులు వారు నేమ్ ఛేంజింగ్ బడ్జెట్ పెట్టారని వ్యాఖ్యానించారు. నవీన్ పట్నాయక్ సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
వారు ప్రవేశపెట్టిన పధకాల్లో 87 శాతం స్కీమ్‌లు ఇప్పటికే బీజేడీ ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. తమ పధకాలను కాపీ కొడుతూ బీజేపీ ప్రభుత్వం నూతన పధకాలుగా చెప్పుకుంటోందని దుయ్యబట్టారు. కాగా, సీఎం మోహన్ చరణ్ మాఝీ నేతృత్వంలోని ఒడిషా ప్రభుత్వం 2024-25 ఆర్ధిక సంవత్సరానికి రూ. 2.65 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఇటీవల ప్రవేశపెట్టింది.
వ్యవసాయం, మౌలిక వసతులు, సంక్షేమం ప్రాధాన్యతలుగా ఈ బడ్జెట్ రూపొందించామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆర్ధిక శాఖను కూడా పర్యవేక్షిస్తున్న సీఎం మోహన్ మాఝీ ఒడిషా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ నిర్వహణ వ్యయం కింద రూ. 97,725 కోట్లు, కార్యక్రమాల అమలుకు రూ. 1.55 లక్షల కోట్లు కేటాయింపులు చేపట్టామని తెలిపారు.
Read More :