న్యూఢిల్లీ: దేశ రాజధానిలో శాంతియుతంగా నిరసన జరుపుతున్న విద్యార్థులపై పోలీసుల అమానుష దమనకాండను నిరసిస్తూ శుక్రవారం దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీజేపీ పిలుపునిచ్చింది. ఈ సమస్యకు చర్చల ద్వారా పరిష్కారం పొందాలని ఒక పక్క కేంద్రం ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ ఆందోళన చేపట్టాలని సీజేపీ కోరింది. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, పౌర సంస్థలు ప్రతి జిల్లాలో శాంతియుతంగా ఆందోళనలు నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది.