న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా బుధవారం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి.10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, ఎస్కేఎం, విద్యుత్తు రంగంలోని ఇంజినీర్ల సంఘం ఏఐపీఈఎఫ్లతో కూడిన సంయుక్త వేదిక ఈ నిరసనలను నిర్వహించింది. ఈ కోడ్ల వల్ల తాము సమ్మె చేసే హక్కును కోల్పోతామని తెలిపింది. సంఘాన్ని నమోదు చేయడం సమస్యాత్మకంగానూ, డీ-రికగ్నయిజ్ చేయడం సులభంగా ఈ స్మృతులు మార్చాయని పేర్కొంది.