శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాకు మంగళవారం నిర్వహించిన పరీక్షలో కొవిడ్ నెగిటివ్గా నిర్ధారణ అయ్యింది.
18 రోజుల క్రితం ఆయనకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. పరీక్షలో తనకు నెగిటివ్ రిపోర్టు రావడంతో ఆయన తీవ్ర భావోధ్వేగానికి గురయ్యారు. తనకంటే అదృష్టవంతులెవ్వరూ లేరంటూ ట్విట్ చేశారు.
“కాస్త జలుబుతో ముక్కు మూసుకుపోవడం మినహా నాకు ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవు. 9 రోజులుగా చాలా ఇబ్బంది పడ్డా. అందరి కంటే నేను చాలా అదృష్టవంతుడిని, భగవంతుడికి రుణపడి ఉంటా” అని ఆయన ట్వీట్ చేశారు.
భగవంతుడికి కృతజ్ఞతలు చెబుతున్నట్లుగా చేతులు జోడించిన ఎమోజీని ట్వీట్ చివరన జోడించారు.
నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, ఒమర్ అబ్దుల్లా తండ్రి ఫరూక్ అబ్దుల్లా సైతం నెల క్రితం కొవిడ్ బారినపడిన విషయం తెలిసిందే.
కొన్నిరోజుల చికిత్స తరువాత ఆయన కోలుకోవడంతో డాక్టర్లు డిశ్చార్జి చేశారు. శ్రీనగర్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఫరూక్ అబ్దుల్లా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
I’ve tested negative for COVID 18 days after first testing positive. Thankfully except for a blocked nose day 9 onwards for a few days, I had no symptoms at all. I know a lot of people aren’t as lucky as I was & I’m deeply grateful for that 🤲🏼
— Omar Abdullah (@OmarAbdullah) April 27, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి