Weather | న్యూఢిల్లీ : అత్యంత వేడి సంవత్సరంగా 2023 అవతరిస్తున్నదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడమే ఇందుకు కారణం. ఈ ఏడాదిలో ఇప్పటికే చాలా రోజుల పాటు ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ప్రి-ఇండస్ట్రీయల్ లెవెల్‌ను దాటి నమోదయ్యాయి.
2023 అక్టోబర్ 2 వరకు 86 రోజుల పాటు ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ప్రి-ఇండిస్ట్రీయల్ లెవెల్ కంటే 1.5 సెల్సియస్ ఎక్కువగా నమోదైనట్టు కోపర్నికస్ ైక్టెమైట్ చేంజ్ సర్వీస్ డాటా విడుదల చేసింది. వాతావరణ మార్పుల కారణంగా 2024లోనూ ఉష్ణోగ్రతలు ఎక్కువగానే అవకాశం ఉందని డాటా విశ్లేషించింది.