Watch: బద్రీనాథ్ హైవేను క్లియర్ చేస్తున్న కార్మికులు.. తృటిలో తప్పిన ముప్పు
Badrinath | ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ హైవే మూసుకుపోయింది. దీనిని క్లియర్ చేసేందుకు కార్మికులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి కొండ రాళ్లు దొర్లడంతో వారు పరుగులు తీశారు. ప్రాణ ముప్పు నుంచి తృటిలో తప్పించుకున్నారు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో కొండచరియలు (landslides) విరిగిపడటంతో బద్రీనాథ్ ( Badrinath)హైవే మూసుకుపోయింది. దీనిని క్లియర్ చేసేందుకు కార్మికులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి కొండ రాళ్లు దొర్లడంతో వారు పరుగులు తీశారు. ప్రాణ ముప్పు నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బద్రీనాథ్ యాత్రకు వెళ్లే జాతీయ రహదారిలోని చమోలి వద్ద బుధవారం రెండు చోట్ల పెద్ద స్థాయిలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ రహదారిని 48 గంటలకు పైగా మూసివేశారు. ఈ నేపథ్యంలో వేలాది మంది యాత్రికులు అక్కడ చిక్కుకున్నారు.
కాగా, పాతాళగంగ వద్ద బుధవారం కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ జాతీయ రహదారిపై సొరంగం ముఖద్వారం వద్ద శిథిలాలు కుప్పలుగా పేరుకుపోయాయి. దీంతో జాతీయ రహదారి మూసుకుపోయింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కొండచరియలను తొలగిచేందుకు కార్మికులు ప్రయత్నించారు. అయితే ఉన్నట్టుండి కొండ రాళ్లు దొర్లుకు వచ్చాయి. గమనించిన కార్మికులు ఒక పక్కకు పరుగెత్తారు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Caught on Camera: Workers’ Narrow Escape While Clearing Badrinath Highway pic.twitter.com/seiFNL6FUX
— زماں (@Delhiite_) July 11, 2024
After that terrifying landslide near Joshimath this morning, this, believe it or not, is part two – and even worse! When it hit, people panicked and there was a stampede to escape.#Landslide #BadrinathHighway #Chamoli #Uttarakhand #uttarakhandnews #Joshimath #Badrinath pic.twitter.com/F6hEsyrKuS
— The Himalayan Gazette (@TheHimalayan01) July 10, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

