PM Modi | ఉత్తరప్రదేశ్ వారణాసి (Varanasi)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ముందంజలో (leading) కొనసాగుతున్నారు. తొలి రౌండ్లో వెనుకంజలోకి వెళ్లిన మోదీ.. మళ్లీ పుంజుకుని లీడింగ్‌లో కొనసాగుతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. మోదీ 79,566 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.
ఇక ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ రాయ్ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. తొలుత ఈసీ వెబ్సైట్ ప్రకారం.. అజయ్ రాయ్ సుమారు 1,600 ఓట్ల తేడాతో లీడింగ్‌లో కొనసాగారు. అయితే రౌండ్లు మారడంతో.. ప్రధాని మోదీ లీడింగ్‌లోకి వచ్చేశారు. అప్పటి నుంచి ముందంజలో కొనసాగుతున్నారు. ఇక ఓవరాల్‌గా చూస్తే ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. ఎన్డీఏ కూటమి 297 స్థానాల్లో, ప్రతిపక్ష ఇండియా కూటమి 225 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
Also Read..
Naveen Patnaik | కాంటాబంజిలో సీఎం నవీన్ పట్నాయక్ వెనుకంజ
Amit Shah | ఎన్డీఏకి తొలి విజయం.. 3.9 లక్షల ఓట్లతో అమిత్ షా ఘన విజయం
Maneka Gandhi | సుల్తాన్‌పూర్‌లో మేనకా గాంధీ వెనుకంజ