Mallikarjun Kharge : మోదీ ప్రభుత్వంపైన, బీజేపీ-ఆరెస్సెస్‌పైన (BJP-RSS) కాంగ్రెస్ పార్టీ (Congress party) జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర ఆరోపణలు చేశారు. అంబేద్కర్ (Ambedkar) పైన నరేంద్రమోదీ ప్రభుత్వానికి, బీజేపీకీ, ఆరెస్సెస్‌కు గౌరవం లేదని, అది కేవలం మాటలకే పరిమితమమని అన్నారు. బీజేపీ, ఆరెస్సెస్‌లు రాజ్యాంగ నిర్మాతకు శతృవులని వ్యాఖ్యానించారు.
‘మోదీ సర్కారుకు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై గౌరవం మాటలకే పరిమితం. ఆయన ఆశయాలను నెరవెర్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. ఆయన వారసత్వంపై పెదవి విరుస్తున్నారు. 1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి ఎస్ఏ డాంగే, వీడీ సావర్కర్లు కారణం. ఈ విషయాన్ని అంబేద్కర్ ఓ లేఖలో పేర్కొన్నారు’ అని ఖర్గే గుర్తుచేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలుచేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. ‘రాజ్యాంగం.. పౌరులకు అంబేద్కర్ ఇచ్చిన బహుమతి అని చెప్పారు. ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం పొందే హక్కును కల్పిస్తుందని తెలిపారు. ఏఐసీసీ సమావేశంలో సామాజిక న్యాయానికి సంబంధించిన అభిప్రాయాలను ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు.