Shivaji Statue : మహారాష్ట్రలోని సింధ్‌దుర్గ్‌లో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కూలిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె కీలక వ్యాఖ్యలు చేశారు. శివాజీ విగ్రహం కూలిన ఘటనలో కేవలం శిల్పి మాత్రమే కాదని పలువురు ఇతరులను కూడా బాధ్యుల్ని చేయాలని అన్నారు.
నానా పటోలె మంగళవారం ముంబైలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బద్లాపూర్‌లో శివాజీ విగ్రహం కూలిన ఉదంతంలో నిందితుడు అదృశ్యం కావడం వెనుక హోంమంత్రి, మహారాష్ట్ర డీజీపీల అసమర్ధ పనితీరే కారణమని దుయ్యబట్టారు. ఈ వ్యవహారంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే దృష్టి సారించాలని నానా పటోలె కోరారు.
శివాజీ విగ్రహం కూలిన ఘటనలో వీరిద్దరినీ తక్షణమే పదవుల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, శివాజీ విగ్రహం కూలిన ఘటన మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కూలిన ఘటనకు తాను ప్రజలకు శిరస్సు వంచి క్షమాపణలు చెబుతున్నానని మహారాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే.
Read More :
Sai Pallavi | పదేండ్లుగా ఆయన్ని ప్రేమిస్తున్నా!: సాయిపల్లవి