న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో సోమవారం ఆడ చీతా జ్వాల, దాని నాలుగు పిల్లలపై రాళ్ల దాడి జరిగింది. చీతాల సంఖ్యను పెంచాలనే లక్ష్యంతో ఆఫ్రికా నుంచి రప్పించి ఈ జిల్లాలోనే పెంచుతున్నారు. అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఈ చీతాలు ఓ పొలంలోని ఆవు దూడను వేటాడే ప్రయత్నం చేశాయి. దీనిని గమనించిన స్థానికులు పెద్ద ఎత్తున శబ్దాలు చేశారు.
ఒకరిద్దరు వాటిపై రాళ్లు విసిరారు. వీటిని పర్యవేక్షిస్తున్న బృందం అవాంఛనీయ సంఘటన జరగకుండా నిరోధించింది. ఈ శబ్దాల వల్ల చీతాలు తిరిగి అడవిలోకి పారిపోయాయి. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నాయి.