ముంబై: మహిళా ఆటో డ్రైవర్‌ను ఒక ప్రయాణికుడు నగ్నంగా వెంబడించాడు. తనతో శృంగారం చేయాలని డిమాండ్ చేశాడు. అతడి బారి నుంచి తప్పించుకున్న ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హడాప్సర్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల నిఖిల్ అశోక్ మెమజడే, సోమవారం రాత్రి మగర్‌పట్టా నుంచి కాట్రాజ్ ఘాట్‌కు వెళ్లేందుకు మహిళ నడుపుతున్న ఆటో ఎక్కాడు. రాత్రి పది గంటలకు కాట్రాజ్ ప్రాంతానికి చేరిన తర్వాత అక్కడ ఓ హోటల్ ముందు ఆటోను ఆపించాడు. ఆ తర్వాత తనతో కలిసి భోజనం చేయాలంటూ మహిళా ఆటో డ్రైవర్‌ను అడిగాడు. ఆమె నిరాకరించగా చెంపపై కొట్టాడు.
ఆ తర్వాత తనతో శృంగారంలో పాల్గొవాలంటూ ఆ మహిళను నిఖిల్ ఒత్తిడి చేశాడు. భయపడిన ఆమె అక్కడి నుంచి పరుగున వెళ్తుండగా అనుసరించాడు. బట్టలు విప్పి నగ్నంగా మారి ఆ మహిళ వెంటపడ్డాడు. అతడి భారి నుంచి తప్పించుకున్న ఆమె చివరకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు నిఖిల్ కోసం వెతికి గురువారం అరెస్ట్ చేశారు.