Nainar Nagendran | తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత చీఫ్‌గా ఉన్న అన్నామలై (K Annamalai) వారసుడిగా నైనార్ నాగేంద్రన్ (Nainar Nagendran) రానున్నట్లు తెలిసింది. అన్నామలై స్థానంలో నాగేంద్రన్ బాధ్యతలు చేపట్టబోతున్నారని సమాచారం.
రాష్ట్ర బీజేపీ చీఫ్ పదవికి నాగేంద్రన్ ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో ఆయన నియామకం ఖాయమైనట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నాగేంద్రన్ పేరును అన్నామలై ప్రతిపాదించినట్లు తెలిసింది. నాగేంద్రన్ నియామకానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నాగేంద్రన్.. గతంలో అన్నాడీఎంకేలో కీలక పాత్ర పోషించారు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేను విడిచిపెట్టి బీజేపీలో చేరారు. 2021లో బీజేపీ-అన్నాడీఎంకే కూటమిలో భాగంగా తిరునల్వేలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అన్నాడీఎంకేతో నాగేంద్రన్‌కు మంచి సంబంధాలున్నందున కూటమి బలపడుతుందని బీజేపీ భావిస్తోంది.
Also Read..
Nitish Kumar As Deputy PM | ‘నితీశ్ కుమార్ ఉప ప్రధాని కావాలి’.. బీజేపీ సీనియర్ నేత ఆకాంక్ష
Sparrow | పిట్టను రక్షించేందుకు రంగంలోకి దిగిన జడ్జి, కలెక్టర్.. అసలు కథ ఇదీ..!