ముంబై, ఆగస్టు 31: విద్యార్థులకు పాఠ్యాంశాల సిలబస్‌లో బీజేపీ చరిత్రను చేర్చేందుకు మహారాష్ట్రలోని నాగ్‌పుర్ యూనివర్సిటీ నిర్ణయం తీసుకొన్నది. మాస్టర్స్ ఇన్ ఆర్ట్(ఎంఏ) కోర్సు నాలుగో సెమిస్టర్లో బీజేపీ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చనున్నట్టు వర్సిటీ తాజాగా ప్రకటించింది. రామజన్మ భూమి ఉద్యమం చరిత్రను బోధిస్తామని తెలిపింది.
ఇదే సమయంలో కమ్యూనిస్టు పార్టీ చరిత్రను తొలగించి, దాని స్థానంలో ప్రాంతీయ పార్టీల చరిత్రలను చేర్చనున్నట్టు పేర్కొన్నది. ఈ మేరకు సంబంధిత ప్రతిపాదనలకు యూనివర్సిటీ హిస్టరీ డిపార్ట్మెంట్ బోర్డ్ ఆప్ ప్రాక్టీస్ ఆమోదం తెలిపింది.