ముంబై: దేశంలో తొలి ‘రెస్టారెంట్ ఆన్ వీల్స్’ను సెంట్రల్ రైల్వే ప్రారంభించింది. మహారాష్ట్రలోని నాగపూర్ రైల్వే డివిజన్ దీనికి చొరవ చూపింది. నాగపూర్ రైల్వే స్టేషన్ బయట ‘రైల్ రెస్టారెంట్’ను ఏర్పాటు చేసింది. పాత కోచ్‌ని రెస్టారెంట్‌గా అభివృద్ధి చేయడానికి టెండర్లను పిలిచినట్లు నాగపూర్ రైల్వే డివిజన్ డీఆర్ఎం రిచా ఖరే తెలిపారు. ‘రెస్టారెంట్ ఆన్ వీల్స్’ను హల్దీరామ్ సంస్థ నిర్వహిస్తున్నదని చెప్పారు. ప్రజల దీనిని ఇష్టపడతారని ఆశిస్తున్నట్లు అన్నారు. మంచి స్పందన వస్తే డివిజన్లోని ఇతర జిల్లా రైల్వే స్టేషన్ల వద్ద కూడా ఇలాంటి ‘రైల్ రెస్టారెంట్ల’ను ప్రారంభిస్తామని వెల్లడించారు.
మరోవైపు వినూత్నంగా ఉన్న ‘రెస్టారెంట్ ఆన్ వీల్స్’ కస్టమర్లను ఆకట్టుకుంటున్నది. ఇది చాలా బాగున్నదని, కొత్త కాన్సెప్ట్ అని ఒక కస్టమర్ తెలిపారు. ‘మహారాజా ఎక్స్‌ప్రెస్’లో భోజనం చేస్తున్న అనుభూతిని ఇస్తున్నదని మరో కస్టమర్ పేర్కొన్నారు.