న్యూఢిల్లీ, జూన్ 14: భారత సైన్యం అమ్ములపొదిలోకి మరో అత్యాధునిక ఆయుధం చేరింది. ఆయుధ, రక్షణ వ్యవస్థ స్వావలంభనలో భాగంగా దేశీయంగా తొలిసారిగా అభివృద్ధి చేసిన సూసైడ్(ఆత్మాహుతి) డ్రోన్ ‘నాగాస్త్ర-1’ ఆర్మీ చేతికి అందింది. 9 కిలోల బరువు ఉండే ఈ డ్రోన్‌ను మనిషి మోసుకెళ్ల్లేలా రూపొందించారు. కామికేజ్ మోడ్‌లో(శత్రు స్థావరాలు, లక్ష్యాలపై డ్రోన్‌ను సొంతంగా కూల్చివేయడం) పనిచేయడం ద్వారా ఈ నాగాస్త్ర శత్రువుల ముప్పును సమర్థంగా నిలువరించగలుగుతుందని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. నాగాస్త్ర-1ను మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని సోలార్ ఇండస్ట్రీస్ కంపెనీ అభివృద్ధి చేసింది.
‘నాగాస్త్ర-1’ ప్రత్యేకతలు: బరువు- 9 కిలోలు, 1 కిలో పేలుడు పదార్థాలు మోసుకెళ్లే సామర్థ్యం l పరిధి- 15-30 కిలోమీటర్లు l 200 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో కనిపించదు l జీపీఎస్ వినియోగంతో కచ్చితమైన దాడులు l లక్ష్యంపై దాడి కచ్చితత్వం- 2 మీటర్లు l 24 గంటల నిఘా కెమెరాలు.