న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ప్రపంచ వ్యాప్తంగా శాకాహార వంటకాలను ఆరగించే వారి సంఖ్య భారత్లోనే అధికంగా ఉంది. అదే సమయంలో దేశంలో 85 శాతం మంది మాంసాహారాన్ని భుజించే వారున్నారని ఒక సర్వే వెల్లడించింది. అయితే మన దేశంలో ముక్క లేకపోతే ముద్ద దిగని రాష్ట్ర ప్రజలు ఎవరంటే నాగాలాండ్ ముందు వరుసలో నిలుస్తుంది.
దేశంలోనే అత్యధికంగా ఇక్కడ మాంసాన్ని వినియోగిస్తారు. ఇక్కడి నివసించే వారిలో 99.8 శాతం మంది మాంసాహారాన్ని ఆరగిస్తారని ఆ సర్వే తెలియజేసింది. తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్ (99.3 శాతం), కేరళ (99.1 శాతం), ఆంధ్రప్రదేశ్ (98.25 శాతం) ఉన్నాయి.