పుదుచ్చేరి, మే 8: పుదుచ్చేరిలో విజయం సాధించిన ఏఐఎన్ఆర్సీ చీఫ్, ఎన్డీఏ నేత ఎన్ రంగస్వామి లెఫ్ట్నెంట్ గవర్నర్ కే కైలాస్నాథన్ను శుక్రవారం కలిశారు. తనకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాన్ని ఎల్జీకి సమర్పించి రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరారు. రంగస్వామితో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఆయనకు మద్దతు తెలిపిన పార్టీల ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వారు సమర్పించిన పత్రాన్ని రాష్ట్రపతి అనుమతి కోసం పంపనున్నట్టు ఎల్జీ ప్రకటించారు. కాగా, ఎల్జీ కార్యాలయం అందించిన సమాచారం ప్రకారం ఈ నెల 13న రంగస్వామి ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 30 మంది సభ్యులున్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రంగస్వామి ఏఐఎన్ఆర్సీ పార్టీ 16 స్థానాల్లో పోటీ చేసి 12 స్థానాల్లో విజయం సాధించింది. దాని మిత్రపక్షం నాలుగు సీట్లను గెల్చుకుంది.