కోల్కతా: కోల్కతాలోని ఒక ప్రభుత్వ భవనంలో శుక్రవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు 4 వేల ఈవీఎంలు దగ్ధమయ్యాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో ఈ ఈవీఎంలు వినియోగించారు. ఈ ప్రమాదంపై విపక్ష తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ మంత్రి కౌశిక్ చౌదరి మాట్లాడుతూ ‘ప్రమాదం సహజంగా జరిగినట్టు కన్పించడం లేదు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రమాదంలో కుట్ర కోణాన్ని కొట్టివేయలేమని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రభుత్వ భవనంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. మంటలను పూర్తిగా అదుపులోకి తేవడానికి 24 గంటల సమయం పట్టినట్టు అధికారులు తెలిపారు. విచిత్ర పరిస్థితుల్లో 4 వేల ఈవీఎంలు ధ్వంసం అయ్యాయని టీఎంసీ ఆరోపించింది. ప్రమాదం ఎలా జరిగిందో ఈసీ వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.