blast near LOC | సరిహద్దులోని నియంత్రణ రేఖ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు
blast near LOC | దేశ సరిహద్దులోని నియంత్రణ రేఖ సమీపంలో పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ పేలుడుకు కారణం ఏమిటన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీనగర్: దేశ సరిహద్దులోని నియంత్రణ రేఖ సమీపంలో పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ పేలుడుకు కారణం ఏమిటన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. (blast near LOC) జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం గుల్మార్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్వోసీ) సమీపంలో ‘ఆశా పోస్ట్’ వద్ద పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. మరో నలుగురు గాయపడ్డారు.
కాగా, మృతుడిని బారాముల్లా జిల్లాలోని చందూసా ప్రాంతానికి చెందిన జాబిర్ అహ్మద్ బజాద్గా గుర్తించారు. గాయపడిన నలుగురిని వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పేలుడుకు కారణాలు ఏమిటన్నది తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు పాత బాంబు షెల్ను తాకడం లేదా కదిలించడం వల్ల ఈ పేలుడు సంభవించినట్లు అనుమానిస్తున్నారు. ఆ పేలుడు పదార్థారం ఏమిటన్నది దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

