బెంగళూరు: ‘మైసూరు పాక్’ పేరును మార్చడంపై దాని సృష్టికర్త ముని మనుమడు అభ్యంతరం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో పాక్‌ను గుర్తు చేసే పేర్లను భారతీయులు ఇష్టపడటం లేదు. ఓ మిఠాయి దుకాణం యజమాని మైసూర్ పాక్‌ను మైసూర్ శ్రీగా మార్చారు.
దీనిపై మైసూరు పాక్ మొదట తయారు చేసిన కకాసుర మడప్ప ముని మనుమడు నటరాజ్ ఓ మీడియాతో మాట్లాడుతూ దీనిని మైసూరు పాక్ అనే పిలవాలని చెప్పారు. మైసూరులో మొదటిసారి తయారు చేయడం, పాక అంటే కన్నడంలో చక్కెర లేదా బెల్లంతో తయారు చేసిన తినుబండారం అని అర్థం ఉండటం వల్ల దానికి మైసూరు పాక్ అనే పేరు వచ్చిందన్నారు.