న్యూఢిల్లీ, జనవరి 17: సుమారుగా రూ.2.89 కోట్లు విలువజేసే బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ ముగ్గురు మయన్మార్ పౌరులు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రెండు కిలోలకుపైగా బంగారం కడ్డీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మయన్మార్‌లోని యాంగాన్ నుంచి బయల్దేరిన ఆ ముగ్గురు ఎయిర్పోర్ట్ టెర్మినల్-3లో గ్రీన్‌చానల్ దాటుతుండగా పట్టుకుని తనిఖీలు చేయగా, 2,158 గ్రాములు బంగా రు కడ్డీలు స్వాధీనం చేసుకున్నా మని, ప్రస్తుతం ఆ ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.